English | Telugu
ఒమన్‌లో బైక్ రైడిరగ్ చేస్తున్న అజిత్ - వీడియో వైరల్
Updated : Sep 15, 2023
తమిళ్ హీరో అజిత్ మల్టీ టాలెంటెడ్ అనే విషయం అందరికీ తెలిసిందే. నటనతో పాటు ఆయనకు ఫార్ములా రేసింగ్ అంటే కూడా ఎంతో ఇష్టం. దేశంలోనే అత్యుత్తమ డ్రైవర్‌గా అజిత్ పేరుగాంచాడు. ఫార్ములా రేసింగ్‌లో ఇండియాలోనే మూడో అత్యుత్తమ డ్రైవర్ అనిపించుకున్నాడు. అంతేకాదు, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆర్మీ కోసం డ్రోన్లు తయారు చేసి ఇచ్చే కాంట్రాక్ట్‌ను అజిత్‌కు అప్పగించింది.
తాజాగా అజిత్ బైక్ రేసింగ్‌కి సంబంధించి ప్రపంచ యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అరబ్ కంట్రీ అయిన ఓమన్‌లో అజిత్ యాత్ర కొనసాగుతోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అజిత్ లేటెస్ట్ మూవీ ‘ఎకె62’ ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ అబుదాబిలో జరుగుతోంది. అందులో భాగంగానే అజిత్ అరబ్ కంట్రీలో ఉన్నారు. సినిమాకి సంబంధించిన వర్క్ చూసకుంటూనే ఖాళీ దొరికితే వెంటనే బైక్‌పై విహార యాత్ర చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు అజిత్. ఆయన రైడ్ ప్రారంభించే ముందు ఓ అభిమానితో ఫోటో దిగారు. ఆ అభిమాని తీసిన ఫోటోలు, వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అవి ఇప్పుడు వైరల్‌గా మారాయి.