వరుణ్, లావణ్య వెడ్డింగ్ పిక్స్.. మేనత్తతో బన్నీ, వరుణ్ ఒడిలో నితిన్
రెండు రోజులుగా మెగా ఫ్యామిలీ అంతా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి హడావిడిలో ఉంది. పెళ్లి వేడుకలు ఇటలీలో ఘనంగా జరుగుతున్నాయి. అక్టోబర్ 30న కాక్ టెయిల్ పార్టీతో వివాహ వేడుక మొదలైంది. అక్టోబర్ 31న హల్దీ, మెహందీ ఫంక్షన్లు జరిగాయి. పెళ్లి వేడుకకు మెగా ఫ్యామిలీ, లావణ్య త్రిపాఠీ కుటుంబం, స్నేహితులు కలిపి మొత్తం 120 మంది ఇటలీకి వెళ్లారు. ఈరోజు(నవంబర్ 1) మధ్యాహ్నం 2:48 గంటలకు ముహూర్తం కాగా, ముందు జరిగే వేడుకలను కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎంతో ఆనందంగా జరుపుకున్నారు.