English | Telugu

Indian 3: ఇండియ‌న్ పార్ట్ 3 రిలీజ్ ఎప్పుడో తెలుసా?

ఇండియ‌న్ సినిమా పార్ట్ 2 రిలీజ్ ఎప్పుడో తెలుసా అని అడ‌గుతారు. కానీ, ఇదేంటి? ఇండియ‌న్‌3 గురించి మాట్లాడుతున్నారు అని అనుకుంటున్నారా? ఇప్పుడు ఇండియ‌న్‌2 క‌న్నా, ఇండియ‌న్ 3 మీదే ఫోక‌స్ ఎక్కువ‌గా క‌నిపిస్తోంది జ‌నాల్లో. క‌మ‌ల్‌హాస‌న్ పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకుని ఆన్‌లైన్‌లో గ్రాండ్‌గా విడుద‌ల చేశారు ఇండియ‌న్‌2 ఇంట్ర‌డ‌క్ష‌న్ టీజ‌ర్‌ని. టీజ‌ర్ చూసి కొంత‌మంది సూప‌ర్బ్ అని మెచ్చుకుంటే, మ‌రికొంద‌రు మాత్రం ఆ.. ఏముంది అందులో అంటూ పెద‌వి విరిచారు. ఆ డిస్క‌ష‌న్ అంత‌టితో కంప్లీట్ అయింది. ఇప్పుడు మాత్రం ఇండియ‌న్‌3 గురించి టాపిక్ మొద‌లైంది.