English | Telugu
మెగా, నందమూరి హీరోలకు పోటీగా బొమ్మాళి!
Updated : Nov 1, 2023
మలయాళ సూపర్ హిట్ 'నాయాట్టు'కి రీమేక్ గా తెలుగులో రూపొందుతోన్న చిత్రం 'కోట బొమ్మాళి పీఎస్'. జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 'జోహార్' ఫేమ్ తేజ మార్ని దర్శకుడు. శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్ కు మంచి స్పందన రాగా, ఇటీవల రిలీజైన 'లింగి లింగి లింగిడి' అంటూ సాగిన శ్రీకాకుళం మాస్ జానపద పాట ఒక ఊపు ఊపుతోంది. ఈ ఒక్క పాటతో 'కోట బొమ్మాళి పీఎస్' చిత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం విడుదల తేదీని చిత్రబందం తాజాగా ప్రకటించింది. నవంబరు 24న ఈ చిత్రం విడుదల కానుంది.
అయితే నవంబరు 24న నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన 'డెవిల్', మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన 'ఆదికేశవ' విడుదల కానున్నాయి. మరి మెగా, నందమూరి హీరోలకు పోటీగా విడుదలవుతున్న కోట బొమ్మాళి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.