English | Telugu
పాముని రెండు ముక్కలుగా చేసి విక్రమ్ అరాచకం
Updated : Nov 1, 2023
తన సినిమా కెరీర్ బిగినింగ్ నుంచి చాలా విబిమన్నమైన చిత్రాలని చేసే హీరో విక్రమ్. తెలుగులోనూ,తమిళంలోనూ సమానమైన క్రేజ్ ని కలిగివున్న విక్రమ్ ని అభిమానులందరూ చియాన్ అని పిలుచుకుంటారు. చియాన్ అనే పదానికి గాడ్, పెద్దవ్యక్తి అనే పేర్లు కూడా ఉన్నాయి. అలాగే విక్రమ్ గతంలో నటించిన సేతు మూవీలో విక్రమ్ క్యారక్టర్ పేరు చియాన్. అప్పటినుంచి విక్రమ్ ని చియాన్ అని అభిమానులు పిలుస్తుంటారు. లేటెస్ట్ గా విక్రమ్ తంగలాన్ అనే ఒక డిఫరెంట్ మూవీ ని చేస్తున్నాడు. ఇప్పుడు ఆ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ అయ్యి ఇండియన్ చిత్ర పరిశ్రమ మొత్తాన్ని షేక్ చేస్తుంది.
విక్రమ్ నుంచి వస్తున్న తాజా చిత్రం తంగలాన్. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నఆ చిత్రం నుంచి వచ్చిన టీజర్ అదిరిపోయింది. ఒంటి మీద కేవలం తెల్లని పంచ మాత్రమే ధరించి అదికూడా గోచి లాగా కట్టుకొని విక్రమ్ క్యారెక్టర్ ఉంది. విక్రమ్ గెటప్ తో పాటు దర్శకుడు రంజిత్ చూపించిన వాతావరణం మొత్తాన్ని చూస్తుంటే పాత కాలం నాటి మనుషులుకి సంబంధించిన కథ అని తెలుస్తుంది. విక్రమ్ జుట్టు కూడా దాదాపు తన కాళ్ళ దగ్గర దాకా వేలాడుతూ ఉంది. అలాగే విక్రమ్ ఒక పెద్ద పాముని చేత్తో రెండు ముక్కలుగా చెయ్యడం ఒళ్ళు గగుర్లు పుట్టించేలా ఉంది. అలాగే విక్రమ్ వీరోచితంగా కత్తితో పోరాడటం కూడా సూపర్ గా ఉంది. మాళవిక మోహన్,పార్వతి, పశుపతి లాంటి ఆర్టిస్ట్ లు కూడా టీజర్ లో కనపడ్డారు. టీజర్ చూసిన తర్వాత అభిమానులందరూ ఈ సారి మా చియాన్ ఇండియన్ చిత్ర పరిశ్రమలో సరి కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని అంటున్నారు.
మొదటి నుంచి విక్రమ్ నటించే ఒక సినిమాకి ఇంకో సినిమాకి పోలిక ఉండదు. తన ప్రతి సినిమాలో కూడా కొత్త రకం గెటప్ ద్వారా ఒక కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకి పరిచయం చేస్తాడు. కర్ణాటక లో ఉన్న బంగారు గనుల నేపథ్యం లో తంగలాన్ చిత్రం రూపుదిద్దుకుంటుంది. స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న తంగలాన్ వచ్చే సంవత్సరం జనవరి 26 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. పొన్నియన్ సెల్వమ్ తర్వాత వస్తున్న తంగలాన్ మూవీ మీద చియాన్ అభిమానులు భారీ ఆశలనే పెట్టుకున్నారు.