English | Telugu

దొంగ రాస్కెల్‌, గాడిద, పాగల్‌.. తరుణ్‌ భాస్కర్‌పై తిట్ల వర్షం!

పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం అనేది చాలా సాధారణమైన విషయం. దాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తుంటారు. ఈమధ్య సోషల్‌ మీడియా విస్తృతమైపోయింది కాబట్టి అందరూ సోషల్‌ మీడియానే ఆశ్రయిస్తున్నారు. దాని ద్వారానే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ‘పెళ్లిచూపులు’ దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటాడు. తన తల్లి పుట్టినరోజు సందర్భంగా ఇన్‌స్టా ద్వారా తల్లి గీతా భాస్కర్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలని డిసైడ్‌ అయ్యాడు. గీతా భాస్కర్‌ అంటే అందరికీ పరిచయం ఉన్న వ్యక్తే. తెలంగాణ యాసను స్పష్టంగా పలికే గీతా భాస్కర్‌కు శేఖర్‌ కమ్ముల చిత్రాల్లో మంచి పాత్రలు చేస్తుంటారు. తాజాగా గీతా భాస్కర్‌ బర్త్‌ డే జరిగింది. తరుణ్‌ భాస్కర్‌ కాస్త ఆలస్యంగా విష్‌ చేశాడట. దీంతో తల్లి స్వీట్‌గా తిట్లు తిట్టేసింది.

తరుణ్‌ భాస్కర్‌ ప్రస్తుతం కీడా కోలా సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. నవంబర్‌ 3న మూవీ రాబోతోంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో బిజీగా ఉండిపోయిన తరుణ్‌ బాస్కర్‌ తన తల్లికి పుట్టిన రోజు విషెస్‌ చెప్పడం ఆలస్యం అయింది. దీంతో తరుణ్‌ భాస్కర్‌ తల్లి గీతా భాస్కర్‌ కొడుకుని ప్రేమగా తిట్టేసింది. తన తల్లి అలా ముద్దుముద్దుగా తిడుతున్న వీడియోను ఇన్‌ స్టాగ్రాంలో పెట్టేశాడు తరుణ్‌ భాస్కర్‌. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌ అవుతోంది.

‘దొంగ రాస్కెల్‌, పాగల్‌, గాడిద.. ఇంత ఆలస్యంగా వస్తావా? నీ కీడా కోలా.. నువ్వూ’ అంటూ తిట్టేసింది. తన తల్లి ఇన్‌స్టాలో ఫాలోవర్స్‌ తక్కువగా ఉన్నారని, దాన్ని పెంచడానికే ఇలా ట్యాగ్‌ చేశానని చెప్పాడు. తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయమంటూ నంబర్‌ కూడా షేర్‌ చేద్దామనుకునే లోపే తరుణ్‌ భాస్కర్‌ని అతని తల్లి తిట్టతో ముంచేసింది.