అగ్రిమెంట్ చూపిస్తాం.. ‘ఈగిల్’పై తప్పుడు ప్రచారం మానండి!
రవితేజ, కార్తిక్ ఘట్టమనేని కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ‘ఈగిల్’. అనుపమ పరమేశ్వరన్, కావ్వా థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టైటిల్ టీజర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, అబిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రంలో రవితేజ పెర్ఫార్మెన్స్ అందర్నీ ఆకట్టుకుంది. రవితేజ కెరీర్లోనే మొదటి పాన్ ఇండియా సినిమాగా విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసుకుంది.