English | Telugu
కూతురు జాన్వికపూర్ లోకి శ్రీదేవి ప్రవేశించిందా?
Updated : Nov 1, 2023
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ దేవర. ప్రస్తుతం దేవర మూవీ షూటింగ్ గోవా లో జరుగుతుంది. మేకర్స్ తాజాగా జాన్వికపూర్ లుక్ ని విడుదల చేసారు. ఈ లుక్ ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.
ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ పోషిస్తున్న దేవర చిత్రం నుంచి ఇదివరకే జాన్వీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఇప్పుడు రెండో లుక్ ని కూడా విడుదల చేసారు. గ్రీన్ కలర్ లంగా,గ్రీన్ కలర్ జాకెట్ మీద బ్లూ కలర్ ఓణీని ధరించిన జాన్వీ సూపర్ గా ఉంది.అలాగే రెండు చేతులని నడుముకి ఆనించి నది పక్కనే చిరునవ్వుతో ఉన్న జాన్వీ ని చూస్తుంటే అచ్చం తన తల్లి శ్రీదేవిల ఉంది .జాన్వీ లుక్ చుసిన అందరు శ్రీదేవి జాన్విలోకి ప్రవేశించిందా అని అనుకుంటున్నారు. ఇక జాన్వీ గెటప్ ని చూస్తుంటే సినిమా లో అచ్చం పల్లెటూరి అమ్మాయి క్యారక్టర్ లో నటించబోతుందని అర్ధం అవుతుంది.జాన్వీ లుక్ కి మా బంగారం అనే క్యాప్షన్ ని కూడా చిత్ర బృందం జోడించదంటే మూవీ లో జాన్వీ క్యారక్టర్ కి ఎంత ప్రాముఖ్యత ఉందో అర్ధం అవుతుంది.
చిత్ర బృందం అఫిషియల్ గా కన్ఫర్మషన్ ఇవ్వకపోయినప్పటకి దేవర లో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ చేస్తున్నాడనే రూమర్ మాత్రం చాలా బలంగా వినిపిస్తూ ఉంది. మరి అదే నిజమైతే ఇప్పుడు రిలీజ్ చేసిన జాన్వీ లుక్ ఎవరి సరసన అయ్యుంటుందని అందరు అనుకుంటున్నారు. ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్న దేవర మీద ఎన్టీఆర్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలే ఉన్నాయి. వచ్చే సంవత్సరం దేవర మూవీ వరల్డ్ వ్యాప్తంగా విడుదల కానుంది.