'రోటి కపడా రొమాన్స్'.. టైటిల్ త్యాగం చేసిన దిల్ రాజు!
లక్కీ మీడియా బ్యానర్ పై సృజన్ కుమార్ బొజ్జంతో కలిసి ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన తాజా చిత్రం 'రోటి కపడా రొమాన్స్'. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష ,మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ రెడ్డి దర్శకుడు. 90 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం టైటిల్ లోగోను శుక్రవారం ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆవిష్కరించారు.