English | Telugu

బెడ్ రూమ్‌లో ప్రముఖ నటి ఆత్మహత్య!

సినిమా రంగానికి సంబంధించి ఇటీవలి కాలంలో విషాదవార్తలు బాగా వినిపిస్తున్నాయి. రకరకాల కారణాలతో ఎంతో మంది కన్ను మూశారు. ముఖ్యంగా సౌత్‌ ఇండియన్‌ సినిమాలో ఎక్కువ విషాదాలు చోటుచేసుకున్నాయి. తాజాగా తిరువనంతపురంలో ఒక హీరోయిన్‌ ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. మలయాళ సినిమాల్లో సహాయనటిగా, ఎన్నో టీవీ సీరియల్స్‌లో నటిగా ఎంతో పాపులర్‌ అయిన రెంజుషా మీనన్‌ ఆత్మహత్య చేసుకున్నారు. 35 ఏళ్ళ చిన్న వయసులోనే రెంజుషా చనిపోవడం మలయాళ ఇండస్ట్రీని కలచివేసింది. తిరువనంతపురం శ్రీకార్యంలోని తన ఫ్లాట్‌లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది రెంజుషా. ఆమె భర్త మనోజ్‌ కూడా సినీ పరిశమ్రకు చెందినవాడే. రెంజుషా ఆత్మహత్యకు గల కారణాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.