English | Telugu

రజనీకాంత్‌ని విలన్ అంటున్న లోకేష్!

హిమాలయ శిఖరాల ఎత్తుని ఎలా అయితే కొలవలేమో సూపర్ స్టార్ రజనీ కాంత్ కి ఉన్న క్రేజ్ ని కూడా అలాగే కొలవలేము. సినిమాల్లో రజనీ ప్రదర్శించే హీరోయిజానికి తమిళనాడు లోనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా కూడా కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అలాంటి రజనీని ఒక దర్శకుడు విలన్ ని చేస్తానని అంటున్నాడు.

రజనీకాంత్ ప్రస్తుతం జ్ఞానవేల్ దర్శకత్వం లో చేస్తున్న సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఆ సినిమా తర్వాత రజనీ ,లోకేష్ కనగ రాజ్ దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. రజనీకాంత్ 171 వ చిత్రంగా అఫీషియల్ గా అనౌన్సుమెంట్ కూడా వచ్చింది. ఆ సినిమా గురించి లోకేష్ మాట్లాడుతూ రజనీ గారిలోని విలనిజం నాకు ఇష్టమని విలనిజం పండించే విషయంలో ఆయన స్టైల్ నాకు చాలా బాగా నచ్చుతుందని మా కాంబినేషన్ లో వచ్చే సినిమా కోసం రజనీ గారి విలనిజాన్ని వాడుకోబోతున్నానని లోకేష్ చెప్పాడు. ఇప్పుడు లోకేష్ మాటలు వైరల్ అవుతున్నాయి. అలాగే తమ మూవీ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఉండబోదని కూడా లోకేష్ చెప్పడం ప్రాధాన్యతని సంతరించుకుంది.


తమిళ చిత్ర సీమలో కొత్త రకం స్క్రీన్ ప్లే తో ముందుకు దోసుపోతున్న దర్శకుడు లోకేష్ కనగ రాజ్. లోకేష్ ఇప్పుడు కేవలం తమిళ దర్శకుడే కాదు ఇండియన్ సినిమా దర్శకుడు కూడా. లోకేష్ లేటెస్ట్ గా విజయ్ తో లియో సినిమా తీసి హిట్ కొట్టాడు. ప్రస్తుతం రజనీకాంత్ తో తెరకెక్కబోయే కొత్త చిత్రాన్ని సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో లోకేష్ కనగ రాజ్ బిజీగా ఉన్నాడు. జైలర్ మూవీ ని నిర్మించిన సన్ పిక్చర్స్ సంస్థే ఇప్పుడు రజనీ లోకేష్ ల సినిమాని నిర్మించబోతుంది. అనిరుద్ సంగీత సారథ్యం వహిస్తున్నాడు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.