English | Telugu
ఐదుగురు హీరోయిన్లతో చిరంజీవి ఆట పాట
Updated : Oct 31, 2023
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం లో ఒక కొత్త చిత్రం తెరకెక్కబోతున్న విషయం అందరికి తెలిసిందే. మెగాస్టార్ గత చిత్రం బోళాశంకర్ పరాజయంతో మెగా అభిమానులు వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు తాజాగా మెగా కొత్త సినిమాకి సంబంధించిన తాజా అప్ డేట్ తో మెగా ఫాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.
మెగాస్టార్ చిరంజీవి గతంలో ఎన్నో సినిమాల్లో ఇద్దరు ,ముగ్గురు హీరోయిన్లతో కలిసి సందడి చేసారు. ఇప్పుడు తెరకెక్కబోయే తన నూతన చిత్రంలో మెగా స్టార్ తొలిసారిగా ఐదుగురు హీరోయిన్ లతో కలిసి కనువిందుచేయబోతున్నారనే టాక్ ఫిలిం సర్కిల్స్ లో బలంగా వినపడుతుంది. ఐదుగురు హీరోయిన్లలో భాగంగా అనుష్క, మృణాళిని సేన్ లుని ఎంపిక చేసారు. మిగతా ముగ్గురు హీరోయిన్లు ని కూడా ఎంపిక చేసే పనిలో చిత్ర బృందం ఉంది. సోషియో ఫాంటసీ నేపథ్యంలో మూడు లోకాల చుట్టూ జరిగే ఈ కథలో భారీ తారాగణం నటించబోతుంది.చిరంజీవి 156 వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీని యూవీ క్రియేషన్స్ అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కిస్తోంది. సాయి మాధవ్ బుర్ర డైలాగులని అందిస్తుండగా ఎం.ఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా ఈ మూవీకి విశ్వంభరుడు అనే టైటిల్ ని పెట్టే యోచనలో చిత్ర బృందం ఉంది.