పూజా హెగ్దేకి లగ్జరీ కారుని గిఫ్ట్‌గా ఇచ్చిన త్రివిక్రమ్!
వరుస సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్న మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’తర్వాత నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్‌ఎస్‌ఎంబి 28’ (వర్కింగ్ టైటిల్). త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మాణంలో ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం కోసం మహేష్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇటీవలే సెకండ్ షెడ్యూల్ షూటింగ్ మొదలై శరవేగంగా జరుగుపుకుంటోంది. మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రినివాస్ ల కాంబినేషన్ లో ఇది మూడవ సినిమాగా తెరకెక్కుతోంది. గతంలో వీరి కాంబో లో వచ్చిన ’అతడు, ఖలేజా’ లు ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి...