English | Telugu

అఖిల్ కి కలిసొచ్చింది.. 'పొన్నియన్ సెల్వన్-2' వాయిదా!

అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ 'ఏజెంట్'. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 28న విడుదల కానుంది. ఆ తేదీ 'పోకిరి', 'బాహుబలి-2' వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలు విడుదలైన సెంటిమెంట్ తేదీ కావడం విశేషం. ఇదిలా ఉంటే ఇప్పుడు ఏజెంట్ విడుదలకి మరో అంశం కలిసిరానుంది. అదేరోజున విడుదల కావాల్సిన భారీ పాన్ ఇండియా మూవీ 'పొన్నియన్ సెల్వన్-2' వాయిదా పడినట్లు తెలుస్తోంది.

కోలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందిన పాన్ ఇండియా ఫిల్మ్ 'పొన్నియన్​ సెల్వన్'. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొదటి భాగం గతేడాది సెప్టెంబరు 30న విడుదలై దాదాపు రూ.500 కోట్ల గ్రాస్ రాబట్టి సత్తా చాటింది. ఇక ఈ సినిమా రెండో భాగం ఏప్రిల్ 28న విడుదల కావాల్సి ఉంది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి ఎక్కువ సమయం పడుతుండటంతో సినిమా విడుదలను వాయిదా వేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు సమాచారం. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశముందని అంటున్నారు.

'పొన్నియన్ సెల్వన్-2' వాయిదా పడటం 'ఏజెంట్' కి కలిసొచ్చే అవకాశముంది. ఏజెంట్ పాన్ ఇండియా మూవీ. ఒకవేళ పొన్నియన్ సెల్వన్-2 తో పాటు విడుదలైతే ఏజెంట్ ని తమిళనాట అసలు పట్టించుకునే పరిస్థితి ఉండదు. పైగా సౌత్ నుంచి వచ్చే పాన్ ఇండియా మూవీ రెండో భాగాలకు నార్త్ లో ఆదరణ ఎక్కువ. 'బాహుబలి-2', 'కేజీఎఫ్-2' వంటి సినిమాలు హిందీలో ఎంతటి సంచలనాలు సృష్టించాయో తెలిసిందే. పొన్నియన్ సెల్వన్-2 ఆ స్థాయిలో కాకపోయినా హిందీలో ఎంతో కొంత ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది. అలా ఏ రకంగా చూసినా అఖిల్ మొదటి పాన్ ఇండియా మూవీ ఏజెంట్ కలెక్షన్లకు పొన్నియన్ సెల్వన్-2 గండి కొట్టే అవకాశముంది. ఇప్పుడు ఆ చిత్రం వాయిదా పడిందనే న్యూస్ తో అఖిల్ కి కలిసొచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.