English | Telugu

పవన్ కోసం ఎదురు చూస్తున్న ఆ ఇద్దరు!

ఒకప్పుడు భారీ చిత్రాల నిర్మాత అంటే ఎ.యం.ర‌త్నం  పేరు చెప్పుకునేవారు. కోలీవుడ్‌లో భారీ బడ్జెట్ తో రూపొందిన చిత్రాలను ఈయన తెలుగులో విడుదల చేసేవారు. అలా ఈయన తెలుగులో విడుదల చేసిన చిత్రాలు అనేకం బ్లాక్ బస్టర్ హిట్స్ సొంతం చేసుకున్నాయి. ఇక తెలుగులో కూడా విజ‌య‌శాంతితో క‌ర్త‌వ్యం, ఆశ‌యం వంటి చిత్రాల‌ను మోహ‌న‌గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించాడు. ఇక తానే మెగాఫోన్ చేత‌ప‌ట్టి పెద్ద‌రికం సినిమా తీశారు. ఆ త‌ర్వాత సంక‌ల్పం సినిమా తీశారు. క‌ర్త‌వ్యం, పెద్ద‌రికం చిత్రాలు విజ‌యం సాధించ‌గా, ఆశ‌యం, సంక‌ల్పం చిత్రాలు బాగా ఆడ‌లేదు. కానీ ఆ తర్వాత తన కుమారులను హీరో డైరెక్టర్లుగా ప్రమోట్ చేసే విషయంలో ఆయన నిర్మించిన  చిత్రాలు బాగా నష్టాలను కలిగించాయి. అలాంటి సమయంలో కోలీవుడ్ స్టార్ తల  అజిత్ ఈయనకు వరుస చిత్రాలు చేసి పెట్టారు. దాంతో ఆర్థికంగా ఈయన మరలా పుంజుకున్నారు.  

రామ్ చ‌ర‌ణ్‌ని కాపాడిన సెల్ఫీ!

రీమేకులనేవి ఎంతోకాలంగా కొనసాగుతున్నాయి. ఒక భాషలో వచ్చి హిట్ అయిన సినిమాలను ఇతర భాషల్లో రీమేక్ చేసే సంస్కృతి సినిమా మొదలైన నాళ్ల నుంచి ఉంది. అది ఇప్పుడు వచ్చింది కాదు. సినిమాలు మొదలైన మొదట్లోనే ఇలా రీమేక్ చిత్రాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అదే పరంపర ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. మన దగ్గర బ్లాక్ బస్టర్ అయిన చిత్రాలను ఇతర భాషల్లో రీమేక్ చేసుకుంటారు. ఇక పవన్ కళ్యాణ్ చాలా వరకు రీమిక్స్ సినిమాలో న‌టిస్తారు. ఇక మన సినిమాలను అత్యధికంగా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ రీమేక్ చేస్తారు.  పవన్ చిరులు ఈమధ్య తమిళ మలయాళ రీమేకులు చేస్తున్నారు. పవన్ తెలుగులో మలయాళ అయ్య‌పుమ్ కోషియ‌మ్ చిత్రాన్ని భీమ్లా నాయక్ గా చేసి సూపర్ హిట్ కొట్టారు. బాలీవుడ్ పింక్ మూవీ ని వకీల్ సాబ్ గా తీశారు.  ప్రస్తుతం తమిళ తేరి  చిత్రాన్ని తెలుగులో హరిష్  శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌గా తీస్తున్నారు.