English | Telugu
'మారుతి నగర్'లో రావు రమేష్ తో ఇంద్రజ!
Updated : Feb 24, 2023
తన తండ్రి రావు గోపాల రావు బాటలోనే పయనిస్తూ విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న రావు రమేష్ త్వరలో హీరోగా అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఆయన టైటిల్ రోల్ పోషిస్తున్న 'మారుతి నగర్ సుబ్రహ్మణ్యం' చిత్ర ప్రకటన తాజాగా వచ్చింది. పీబీఆర్ సినిమాస్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.2 గా రూపొందనున్న ఈ చిత్రానికి 'హ్యాపీ వెడ్డింగ్' ఫేమ్ లక్షణ్ కార్య దర్శకుడు. ఇక ఈ చిత్రంలో రావు రమేష్ సరసన సీనియర్ హీరోయిన్ ఇంద్రజ నటిస్తుండటం విశేషం.
'మారుతి నగర్ సుబ్రహ్మణ్యం'లో నడి వయస్కుడైన మధ్య తరగతి నిరుద్యోగిగా రావు రమేష్ కనిపిస్తారని, ఈ చిత్రం రెండు గంటల పాటు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని మేకర్స్ తెలిపారు. ఈ మూవీ షూటింగ్ మార్చి నుంచి మొదలుకానుంది. మరి ఇంతకాలం విభిన్న పాత్రలతో అలరించిన రావు రమేష్ హీరోగానూ అలరించి హిట్ కొడతారేమో చూద్దాం.