English | Telugu
'ssmb 28' ఫస్ట్ లుక్ కి ముహూర్తం ఫిక్స్!
Updated : Feb 24, 2023
'అతడు', 'ఖలేజా' తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న హ్యాట్రిక్ ఫిల్మ్ 'ssmb 28'(వర్కింగ్ టైటిల్). హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలో ఈ చిత్రం నుంచి అదిరిపోయే సర్ ప్రైజ్ రాబోతుందని తెలుస్తోంది.
ఉగాది కానుకగా మార్చి 22న 'ssmb 28' టైటిల్ రివీల్ తో పాటు ఫస్ట్ లుక్ ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాకి 'అయోధ్యలో అర్జునుడు' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. మరి అదే టైటిల్ ని ఖరారు చేశారో లేక వేరే ఏదైనా టైటిల్ పెట్టారో అనేది త్వరలోనే తేలిపోనుంది.
శ్రీలీల సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత మహేష్ తన 29వ సినిమాని ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో చేయనున్నాడు.