అప్పుడు ఎన్టీఆర్ 'బడిపంతులు'.. ఇప్పుడు ధనుష్ 'సార్'!
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ద్విభాషా చిత్రం 'సార్'(వాతి). శ్రీకర స్టూడియోస్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. కోలీవుడ్ స్టార్ ధనుష్, సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు.