English | Telugu

‘ఖుషి’ విష‌యంలో ఇంట్ర‌స్టింగ్ న్యూస్‌!

సమంత హీరోయిన్‌గా విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం ఖుషి. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తయి ఉండాల్సింది. కానీ సమంతకు మయోసైటీస్ వ్యాధి రావడం నాగచైతన్యత విడాకుల నేపథ్యంలో ఈ సినిమా వాయిదా పడింది. ఇంక సమంత తాజాగా మయోసైటీస్ నుంచి కోలు కున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసిన వీడియోలు ఫోటోలు చూస్తుంటే ఆమె మరలా ఫిట్గా ఉన్నట్టు అర్థమవుతుంది. ఇప్పటికే పలుమార్లు సమంతా వలన ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. కానీ ఈసారి మాత్రం ఎలాంటి వాయిదాలు లేకుండా సినిమాలు పూర్తి చేయాలని యూనిట్ భావిస్తోంది.ఈ రోజు రేపు విజయ్ దేవరకొండ మీద సోలోగా  వచ్చే కొన్ని ఎపిసోడ్స్ ను చిత్రీకరించనున్నారు.