ధనుష్ 'సార్'పై ప్రశంసలు కురిపించిన భారతీరాజా!
కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ద్విభాషా చిత్రం సార్(వాతి). సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ఇందులో ధనుష్ తో పాటు సముద్రఖని, సంయుక్త మీనన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 17న విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మెప్పు పొందుతోంది.