English | Telugu

పవన్ చిత్రంలో శ్రీలీల స్పెషల్ సాంగ్!

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయంగా జనసేన పనులతో పాటు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం 80 శాతం వరకు షూటింగ్ పూర్తయిందని సమాచారం. 20శాతం షూటింగ్ పెండింగ్ ఉంటుందట. ఈ చిత్రాన్ని పీరియాడికల్ మూవీగా నిర్మిస్తున్నారు. పవన్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం ఇదేనంటున్నారు. నిర్మాత ఎ.యం.ర‌త్నం ఈ చిత్రంపై భారీ బడ్జెట్‌ను ఖర్చు పెడుతున్నాడు.

ఈ సినిమా తర్వాత పవన్ నటించబోయే సినిమాలు వరుసగా ఉన్నాయి. ఆయా చిత్రాలకు పవన్ కొబ్బరికాయలు కొట్టాడు. సాహో దర్శకుడు సుజిత్ తో ఓజి (ఒరిజినల్ గ్యాంగ్స్టర్ )హరిష్ శంకర్ దర్శకత్వంలో తమిళ తేరీకి రీమేక్ గా ఉస్తాద్ భగత్ సింగ్ రూపొంద‌నుంది. వినోదాయ సిత్తం అనే త‌మిళ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంషూటింగు ప్రారంభమైంది. ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన అల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడు. తమిళంలో ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన సముద్ర ఖ‌నినే తెలుగులో కూడా దర్శకత్వం వహిస్తూ ఉండడం విశేషం. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. తమిళం నుండి కేవలం మెయిన్ స్టోరీ లైన్ మాత్రమే తీసుకొని సరికొత్తగా చిత్రాన్ని మలిచాడు త్రివిక్రమ్. ఈ చిత్రంలో కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ నటిస్తున్నారు. ఇక తమిళంలో ఈ సినిమాలో పాటలు ఫైట్స్ ఉండవు. తెలుగులో పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి పాటలు అంటున్నారు.

ఇక ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ మీద ఓ అదిరిపోయే పాట ఉంటుందిట‌. ఇది ఊర మాస్ సాంగ్ ఉంటుందట. ఈ పాట ఈ సినిమాకి హైలైట్ గా ఉందని సమాచారం.అంతే కాదు ఈ పాట‌లో యంగ్ బ్యూటీ శ్రీ‌లీలా కూడా కనిపిస్తుందని స‌మాచారం. ఇందుకోసం ఆమెకు భారీ మొత్తం ఇచ్చినట్టు టాక్. అంటే ఈ పాటలో పవన్ సాయి ధరంతేజలతో పాటు శ్రీలీలా కూడా ఆడిపాడ‌నుంది. ఇలా ఎన్నో విశేషాలతో ఈ చిత్రం రూపొందుతోంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఎంట‌ర్ టైన్ చేస్తుందో వేచి చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.