రీమేక్ దర్శకులందరూ ఖాళీగా ఉన్నారు!
ఒకప్పుడు రీమేక్ దర్శకులు అంటే రవి రాజా పినిశెట్టి, ముత్యాల సుబ్బయ్య, భీమినేని శ్రీనివాసరావు వంటి వారిని గుర్తు చేసుకునేవారు. ప్రస్తుతం కిషోర్ కుమార్ పార్థసాని అలియాస్ డాలి, సాగర్ చంద్ర, వేణు శ్రీరామ్, మోహన్ రాజా, వివి వినాయక్ వంటి వారు రీమేక్ చిత్రాల స్పెషలిస్ట్ లుగా చెప్పుకోవాలి. వీరు రీమేక్ చిత్రాలను బాగా తెరకెక్కిస్తారని పేరును తెచ్చుకున్నారు. కానీ వీరందరూ ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు. కొంచెం ఇష్టం కొంచెం కష్టంతో దర్శకునిగా పరిచయమయ్యాడు డాలీ. రెండవ ప్రయత్నంగా తమిళ సినిమాని రీమేక్‌గా తడాఖా చిత్రం చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఓ మై గాడ్ అనే చిత్రాన్ని తెలుగులో పవన్ కళ్యాణ్, వెంకటేష్‌తో గోపాల గోపాల టైటిల్ తో రీమేక్ చేశారు. ఇది యావరేజ్‌గా ఆడింది.