English | Telugu
పుష్ప 2 రిలీజ్ డేట్ ఫిక్స్!
Updated : Feb 23, 2023
పుష్ప సినిమాతో క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ సత్తా చాటుకున్నారు. పుష్ప1 ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఒక్క సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ప్రస్తుతం పుష్ప2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బన్నీ మరో ప్రాజెక్టు జోలికి పోకుండా పుష్పా2 కోసమే తన మొత్తం సమయాన్ని కేటాయిస్తున్నారు. అప్డేట్ కోసం ప్రేక్షకులు ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఫస్ట్ లుక్, పోస్టర్, టీజర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని ఎదురు చూస్తున్నారు. షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రమోషన్స్ అన్నీ కలుపుకొని పుష్పా2 రిలీజ్ కావాలంటే వచ్చే ఏడాది పడుతుందట. 2024 వేసవిలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే 2024 మార్చిలో పుష్ప2 రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. షూటింగ్ కి ఎంత సమయం అవసరమో పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా అంత సమయం పట్టేలా ఉన్నాయి. ఇక ఈ సినిమా అప్డేట్ కోసం ఏప్రిల్ 8 వరకు ఆగాల్సిందే.బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇవ్వనున్నారు.
పుష్ప 2 షూటింగ్ జరుపుకుంటుంది. పార్ట్ వన్ తో పోలిస్తే పార్ట్ టు మారింత గ్రాండియర్ గా ఉండేలా సుకుమార్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విశాఖపట్నం ఏరియాలో షూటింగ్ జరుగుతుంది. తాజాగా హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ని ఇటీవల షూట్ చేశారు. త్వరలో రష్మిక మందన పుష్ప 2 సెట్ లోకి అడుగుపెట్టనుంది.