రజనీ చిత్రంలో సూర్య... నిడివి ఫిక్స్!
రజనీకాంత్ సినిమాలో సూర్య కీ రోల్ చేస్తున్నారనే వార్త ఇప్పుడు చెన్నైలో ట్రెండింగ్ న్యూస్. ప్రస్తుతం నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో జైలర్‌లో నటిస్తున్నారు రజనీకాంత్. కోలమావు కోకిల, డాక్టర్, బీస్ట్ సినిమాలకు దర్శకత్వం వహించారు నెల్సన్ దిలీప్‌కుమార్. ఇప్పుడు భారీ స్టార్ కాస్ట్ తో రజనీకాంత్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, శివకార్తికేయన్‌తో పాటు పలువురు హీరోలు ఈ సినిమాలో కీ రోల్స్ చేస్తున్నారు.