'ఎన్టీఆర్ 30' ఫస్ట్ లుక్ కి ముహూర్తం ఫిక్స్!
'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఎన్టీఆర్ 30'(వర్కింగ్ టైటిల్). యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, విలన్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది.