English | Telugu

హనీమూన్ టైంలో గొడవయ్యింది...షోలో చెప్పిన ఆది..!

"అలా మొదలయ్యింది" షో ప్రతీ వారం నవ్వులతో సాగిపోతోంది. హోస్ట్ వెన్నెల కిషోర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులే నవ్వులు కదా. ఇక ఈ షోకి వచ్చే సెలబ్రిటీస్ ని కూడా  అలాగే నవ్విస్తూ ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ ని అందిస్తున్నాడు. ఇక ఇప్పుడు నెక్స్ట్ వీక్ షో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి ఆది సాయికుమార్ తన వైఫ్ అరుణతో కలిసి వచ్చాడు. వీళ్ళను కిషోర్ తెగ నవ్వించాడు. రావడంతోనే "మాది అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ కాదు" అని క్లారిటీ ఇచ్చేసాడు ఆది. మీరు మీ ఆయన్న పేరుతో పిలుస్తారా లేదా ఏవండీ అని అలా పిలుస్తారా అని కిషోర్ అడిగేసరికి అరుణ నవ్వేసింది. సినిమా వాళ్ళు అంటే ఎవరికైనా కొంచెం టెన్షన్ ఉంటుంది కదా "నేను కూడా ఆ విషయం గురించే మా అమ్మా వాళ్ళను అడిగాను...ఎలాగమ్మా మీరు ఈ సంబంధాన్ని ఓకే చేసి పెళ్లి చూపుల వరకు తీసుకొచ్చారు" అని అంది అరుణ.