English | Telugu

అప్పులు తీర్చలేకపోతున్నా...అందరికీ సారీ...

  టీవీ ఇండస్ట్రీలో రీసెంట్ గా ఒక విషాదం నెలకొంది. ఢీ షోలో  ఫేమస్  కొరియోగ్రాఫర్‌గా రాణిస్తున్న డ్యాన్స్ మాస్టర్ చైతన్య సూసైడ్ చేసుకుని మరణించారు. నెల్లూరులోని క్లబ్ హోటల్ లో ఉండి తాను సూసైడ్ చేసుకుంటున్నట్లుగా ఒక వీడియోని రికార్డు కూడా చేసాడు. తన మరణానికి కారణం ఆర్థిక ఇబ్బందులే అని అందులో పేర్కొన్నారు. సూసైడ్ చేసుకుంటున్నందుకు  తన తల్లిదండ్రులకు, తోటి డ్యాన్స్ మాస్టర్లకు, డ్యాన్సర్లకు పేరుపేరునా ఈ వీడియోలో  సారీ చెప్పాడు చైతన్య. అప్పులు చేసాను కానీ  వాటిని తీర్చలేకపోతున్నానంటూ బాధపడ్డాడు. ఒత్తిడి తట్టుకోలేక ఏం చేయాలో అర్థంకాకే ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆ సెల్ఫీ వీడియోలో చెప్పుకుని బాధపడ్డాడు.