English | Telugu
రజనీ చిత్రంలో సూర్య... నిడివి ఫిక్స్!
Updated : Apr 28, 2023
రజనీకాంత్ సినిమాలో సూర్య కీ రోల్ చేస్తున్నారనే వార్త ఇప్పుడు చెన్నైలో ట్రెండింగ్ న్యూస్. ప్రస్తుతం నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో జైలర్‌లో నటిస్తున్నారు రజనీకాంత్. కోలమావు కోకిల, డాక్టర్, బీస్ట్ సినిమాలకు దర్శకత్వం వహించారు నెల్సన్ దిలీప్‌కుమార్. ఇప్పుడు భారీ స్టార్ కాస్ట్ తో రజనీకాంత్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, శివకార్తికేయన్‌తో పాటు పలువురు హీరోలు ఈ సినిమాలో కీ రోల్స్ చేస్తున్నారు. రజనీకాంత్ తన కేరక్టర్ పనులను పూర్తి చేసేశారట. అందుకే నెక్స్ట్ సినిమాల మీద ఫోకస్ చేస్తున్నారు రజనీకాంత్.పెద్ద కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో లాల్ సలామ్ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో గెస్ట్ రోల్ చేస్తున్నారు రజనీకాంత్. ఈ షూటింగ్ పూర్తి కాగానే ఆయన జై భీమ్ డైరక్టర్ జ్ఞానవేల్ రాజా డైరక్షన్‌లో సినిమా చేయడానికి ఓకే చెప్పారు. వాస్తవ ఘటనల ఆధారంగా జ్ఞానవేల్ కథను రెడీ చేసుకున్నారట. వినగానే రజనీకి నచ్చినట్టు సమాచారం.
రజనీకాంత్ 170వ సినిమాలో కీలక పాత్రలో సూర్య నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. సూపర్‌స్టార్ ఫ్యాన్స్ ఈ విషయాన్ని వైరల్ చేస్తున్నారు. రజనీకాంత్‌తో సూర్య నటించే సన్నివేశాలు సినిమాలో 15 నిమిషాల పాటు ఉంటాయట. సూర్య ప్రస్తుతం వాడివాసల్, కంగువా సినిమాల్లో నటిస్తున్నారు. ఫ్యామిలీని ముంబైకి షిఫ్ట్ చేసే పనుల్లోనూ తలమునకలై ఉన్నారు. చెన్నైకి షూటింగ్ ఉంటే తప్ప పెద్దగా రావడం లేదు.
ప్రస్తుతం సూర్య నటిస్తున్న కంగువా సినిమా షూటింగ్ కొడైకానల్‌లో జరుగుతోంది. ఈ సినిమా మోషన్ పోస్టర్‌ని ఇటీవల విడుదల చేశారు. భారీ వ్యయంతో తెరకెక్కుతున్న కంగువా సినిమాను 10 భాషల్లో విడుదల చేయనున్నారు. కమల్‌హాసన్ నటించిన విక్రమ్ సినిమాలో సూర్య చేసిన రోలెక్స్ కేరక్టర్‌కి విశేష స్పందన వచ్చింది. ఇప్పుడు సూపర్‌స్టార్ సినిమాలో చేయనున్న పాత్రకు అంతకు మించిన స్పందన వచ్చి తీరుతుందనే మాటలు వినిపిస్తున్నాయి.