రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'లో బాలీవుడ్ విలన్!
బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ విలన్ గా వెలుగొందుతున్న 'హ్యారి జోష్'.. "తెలుగులో ఇక పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తాను" అంటున్నాడు. 'వాంటెడ్', 'వెల్కమ్', 'ధూమ్-2', 'గోల్ మాల్-3', 'టార్జాన్ ది వండర్ కార్', 'కిస్నా', 'ముసాఫిర్', 'రామయ్యా వస్తావయ్యా', 'సింగ్ ఈజ్ బ్లింగ్' వంటి హిందీ చిత్రాల్లో నటించి మెప్పించిన హ్యారి.. తెలుగులో అల్లు అర్జున్ హీరోగా వి.వి.వినాయక్ రూపొందించిన 'బద్రినాథ్'లో ముఖ్య విలన్ గా నటించి టాలీవుడ్ దృష్టిని విశేషంగా ఆకర్షించాడు.