English | Telugu
సిమ్లా వెకేషన్ లో ‘బలగం’ మూవీ డైరెక్టర్!
Updated : Apr 27, 2023
వేణు ఎల్దండి.. బలగం మూవీతో సంచలనం సృష్టించాడు. ఇప్పటికే ఈ మూవీ సినీ రాజకీయ ప్రముఖుల చేత ప్రశంసలు అందుకుంది. ప్రతి పల్లెలో ఈ 'బలగం' మారుమ్రోగుతోంది. మొదటి సినిమానే ఇంత భారీ విజయం సాధించడంతో.. సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు వేణు. ఇప్పటికే ఈ మూవీ పలు అవార్డులు సొంతం చేసుకుంది.
వేణు మొదటగా తన కెరీర్ ని చిన్న చితక పాత్రలతో స్టార్ చేసాడు. ఆ తర్వాత జబర్దస్త్ షో లో వేణు వండర్స్ టీం కి లీడర్ గా చేసి మంచి ఫేమ్ సంపాదించాడు. కొన్ని సంవత్సరాల పాటు జబర్దస్త్ లోనే కొనసాగిన వేణు.. కొన్ని కారణాల వల్ల ఆ షోకి దూరమయ్యాడు. చాలా రోజులు తెరపై కన్పించని వేణు.. బలగం మూవీతో మళ్ళీ ప్రేక్షకులకు ముందుకు వచ్చాడు. బలగం సినిమా డైరెక్ట్ చేసి.. ఆ సినిమాలోనే తను కూడా చిన్న పాత్రని పోషించిన విషయం తెలిసిందే.
బలగం మూవీ హిట్ అవడంతో వేణు పాపులారిటీ మరింత పెరిగింది. జబర్దస్త్ నుండి వేణుకి సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీనులతో మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. అందుకే మొదటినుండి వాళ్ళు ముగ్గురు ఏ వెకేషన్ అయినా కలుస్తుంటారు. అయితే తాజాగా వేణు, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను ముగ్గురు కలిసి సమ్మర్ వెకేషన్ అంటూ సిమ్లా, మనాలి వెళ్ళారు. వీళ్ళు ముగ్గురు కలిసి ఈ టూర్ కి వెళ్ళిన విషయాన్ని తెలుపుతూ వేణు తన ఇన్ స్టాగ్రామ్ లో 'సిమ్లా డైరీస్' అంటూ ఒక వీడియో ని పోస్ట్ చేశాడు. అయితే అది కాస్త వైరల్ గా మారింది.