English | Telugu

రూమర్స్ కి చెక్.. 'SSMB 28' నుంచి అదిరిపోయే అప్డేట్!

'అతడు', 'ఖలేజా' తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ ముచ్చటగా మూడోసారి చేతులు కలిపారు. మహేష్ కెరీర్ లో 28వ సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తోంది. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. అయితే ఏవో కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ నెమ్మదిగా సాగుతోంది. త్రివిక్రమ్ తీరు పట్ల మహేష్ అసంతృప్తిగా ఉన్నాడని వార్తలొస్తున్నాయి. దీంతో అసలు ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుంది? నిజంగా సంక్రాంతికి విడుదలవుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా ఈ వార్తలకు చెక్ పెట్టిన నిర్మాత నాగవంశీ.. అదిరిపోయే అప్డేట్ కూడా ఇచ్చి ఫ్యాన్స్ ని ఖుషి చేశారు.

'ఎస్ఎస్ఎంబి 28' షూటింగ్ మొదటి నుంచి ఎందుకనో బ్రేక్ లు పడుతూ నెమ్మదిగానే సాగుతోంది. మహేష్ కాలికి సర్జరీ అని, స్క్రిప్ట్ లో మార్పులని ఇలా రకరకాల వార్తలు వినిపించాయి. ఓ వైపు పవన్ కళ్యాణ్ సినిమాలకు స్క్రిప్ట్ అందిస్తూ, మరోవైపు ఎన్టీఆర్ వంటి వారితో యాడ్ షూట్ లు చేస్తూ.. త్రివిక్రమ్ 'ఎస్ఎస్ఎంబి 28'పై పూర్తి ఫోకస్ పెట్టడం లేదని, ఇప్పటిదాకా చేసిన కొంత షూట్ లోనే మళ్ళీ రీషూట్ లు అంటున్నారని.. దీంతో మహేష్ అసంతృప్తి ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మహేష్ ఈ సినిమా త్వరగా పూర్తి చేసి, రాజమౌళి సినిమాతో బిజీ కావాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. కానీ త్రివిక్రమ్ తీరుతో ఈ సినిమా ఆలస్యమవుతుండటంతో, ఆ ఫ్రస్ట్రేషన్ లోనే మహేష్ ఫ్యామిలీ ట్రిప్స్ కి వెళ్తున్నాడని ఇలా రకరకాల వార్తలు గుప్పుమన్నాయి.

అయితే యువ నిర్మాత నాగవంశీ మాత్రం 'ఎస్ఎస్ఎంబి 28' గురించి వస్తున్న రూమర్స్ ని నమ్మొద్దని ట్వీట్ చేశాడు. వచ్చే సంక్రాంతికి అదిరిపోయే బ్లాక్ బస్టర్ ఇస్తామని ప్రామిస్ చేశాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ కి నచ్చిందని, మే 31న మరో అదిరిపోయే అప్డేట్ ఇస్తామని పేర్కొన్నాడు. మే 31న మహేష్ తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ జయంతి. నాగవంశీ ట్వీట్ ని బట్టి చూస్తుంటే ఆరోజు 'ఎస్ఎస్ఎంబి 28' నుంచి గ్లింప్స్ విడుదలయ్యే అవకాశముంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.