English | Telugu
ఫుల్ 'ఖుషి'గా సమంత!
Updated : Apr 28, 2023
విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఖుషి'. ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫిల్మ్ ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక నేడు(ఏప్రిల్ 28) సమంత పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ కొత్త పోస్టర్ ను వదిలారు. పోస్టర్ లో సమంత ఎంతో అందంగా ఉంది. భుజానికి ల్యాప్ టాప్ బ్యాగ్, మెడలో ఐడీ కార్డుతో ఆమె ఫుల్ ఖుషిగా కనిపిస్తోంది.
ఖుషి సినిమా సెప్టెంబర్ 1న విడుదల కానుంది. ఈ సినిమా ఫలితం హీరో హీరోయిన్లతో పాటు దర్శకుడికి కూడా కీలకం. 'లైగర్'తో విజయ్, 'శాకుంతలం'తో సమంత, 'టక్ జగదీష్'తో శివ నిర్వాణ.. ఇలా ముగ్గురూ తమ చివరి చిత్రాలతో నిరాశపరిచారు. మరి ఖుషితో ఆ లెక్క సరిచేస్తారేమో చూడాలి. హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా జి.మురళి, ఎడిటర్ గా ప్రవీణ్ పూడి వ్యవహరిస్తున్నారు.