English | Telugu

రా మిత్ర‌మా... క‌లిసి ప్ర‌యాణం చేద్దామ‌న్న ద‌ళ‌ప‌తి!

విశాల్‌లో మార్పు అలా క‌నిపించిందో లేదో, ఇండ‌స్ట్రీ టాప్ హీరోలంద‌రూ రా మిత్రమా అంటూ మ‌న‌సారా పిలుస్తున్నారు. లేటెస్ట్ గా విశాల్‌ని పిలిచి మాట్లాడారు ద‌ళ‌ప‌తి విజ‌య్‌.విజ‌య్‌, లోకేష్ క‌న‌గ‌రాజ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న సినిమా లియో. ఈ చిత్రంలో న‌టించ‌మ‌ని విశాల్‌ని అడిగారు. అయితే విశాల్‌కి ప్ర‌స్తుతం ఉన్న క‌మిట్‌మెంట్స్ వ‌ల్ల వాళ్ల‌డిగిన కాల్షీట్‌ని కేటాయించ‌లేక‌పోయారు. ఈ విష‌యాన్ని విజ‌య్‌కి ప‌ర్స‌న‌ల్‌గా చెబుదామ‌ని వెళ్లారు విశాల్‌. ప‌నిలో ప‌నిగా తానిప్పుడు న‌టిస్తున్న మార్క్ ఆంటోని టీజ‌ర్‌ని చూపించారు. వెంట‌నే విజ‌య్‌కి టీజ‌ర్ చాలా బాగా న‌చ్చింది. ఈ చిత్రానికి ఆదిక్ రవిచంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. టీజ‌ర్ న‌చ్చ‌డంతో వెంట‌నే అన్‌వీల్ చేసేశారు విజ‌య్‌. వెంట‌నే విజ‌య్ పేరుమీద ఓ వృద్ధాశ్ర‌మంలో భోజ‌నం ఏర్పాట్లు చేశారు విశాల్‌. ఆ విష‌యం తెలిసి విజ‌య్ చాలా సంతోషించార‌ట‌. విశాల్ నెక్స్ట్ ప్రాజెక్టుల గురించి అడిగి తెలుసుకున్నార‌ట‌.విశాల్ ద‌ర్శ‌క‌త్వంలో తుప్ప‌రివాల‌న్‌2 తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో ఆయ‌నే హీరో. విజ‌య్‌ని ఉద్దేశించి రెండు, మూడు క‌థ‌లు రాసి పెట్టుకున్నార‌ట విశాల్‌. ఒక‌సారి తీరిగ్గా ఉన్న‌ప్పుడు వ‌చ్చి క‌థ చెప్పండి. మ‌నం క‌లిసి ప్ర‌యాణం చేద్దాం అని అన్నార‌ట విజ‌య్‌. అంటే నియ‌ర్ ఫ్యూచ‌ర్‌లో విశాల్ డైర‌క్ష‌న్‌లో సినిమా చేయ‌డానికి విజ‌య్ రెడీ అవుతున్నార‌న్న‌మాట‌.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.