English | Telugu

'ఏజెంట్' కాదిది.. మరో 'లైగర్'!

కొందరు యువ హీరోలు పెద్ద దర్శకులను నమ్మి నెలల తరబడి కష్టపడి బాడీ బిల్డప్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో తమ దశ తిరిగినట్టే అని కలలు కంటూ దర్శకుడు చెప్పినట్టుగా చేసి, సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేస్తున్నారు. తీరా సినిమా విడుదలయ్యాక బొక్క బోర్లా పడుతున్నారు. చేతిలో పెద్ద దర్శకుడు ఉన్నాడు, భారీ బడ్జెట్ పెట్టే నిర్మాతలు ఉన్నారు.. ఇక మనం దర్శకుడు కోరినట్టుగా మనల్ని, మన దేహాన్ని మలచుకుంటే చాలు అనుకుంటున్నారు తప్ప.. అన్నింటి కన్నా ముఖ్యమైన బలమైన కథ ఉందా లేదా అని ఆలోచించడం లేదు. అదే ఘోర పరాజయాలకు కారణమవుతోంది.

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా మూవీ 'లైగర్'. గతేడాది భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. విడుదలకు ముందు ఈ మూవీ టీమ్ చేసిన హడావుడి అంతాఇంతా కాదు. ముఖ్యంగా విజయ్ అయితే సినిమా విడుదలయ్యాక థియేటర్లు బద్దలవుతాయి, వసూళ్ల సునామీ సృష్టిస్తుంది అన్నాడు. తీరా విడుదలయ్యాక ప్రేక్షకులు ఆ సినిమా చూసి.. అసలు సినిమాలో ఏముందని ఇంత హడావుడి చేశారంటూ పెదవి విరిచారు. ఇంచుమించు 'ఏజెంట్' విషయంలోనూ ఇప్పుడదే సీన్ రిపీట్ అయింది.

అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ 'ఏజెంట్'. మొదట పాన్ ఇండియా సినిమా అని ప్రమోట్ చేసినా.. చివరికి తెలుగు, మలయాళ భాషల్లోనే విడుదల చేశారు. సినిమా ప్రకటించిన కొత్తలో విపరీతమైన బజ్ ఏర్పడింది. విడుదల ఆలస్యం కారణంగా సినిమాపై బజ్ తగ్గినా.. టీం మాత్రం సినిమాపై చాలా నమ్మకం పెట్టుకున్నారు. అఖిల్ మార్కెట్ కి మించి భారీ బడ్జెట్ పెట్టారు నిర్మాతలు. అఖిల్ ఈ సినిమా కోసం ఎన్నో నెలల పాటు కష్టపడి బాడీ పెంచాడు. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని, సినిమా తర్వాత తన రేంజ్ మారిపోతుందని అఖిల్ ఎంతగానో నమ్మాడు. లైగర్ విడుదలకు ముందు విజయ్ చెప్పినట్లుగానే.. ఏజెంట్ విడుదలకు ముందు అఖిల్ కూడా సినిమా గురించి ఎంతో గొప్పగా చెప్పాడు. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్టుగా మాట్లాడాడు. తీరా విడుదలయ్యాక మొదటి షో నుంచే ఇది మరో లైగర్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ రెండు సినిమాల విషయంలోనూ హీరోలు పెద్ద దర్శకులని నమ్మారు, బాడీలు పెంచి బాగా కష్టపడ్డారు కానీ.. కీలకమైన స్క్రిప్ట్ ఎంపికపై మాత్రం దృష్టి పెట్టలేదని స్పష్టమవుతోంది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.