English | Telugu
క్యాస్టింగ్ కౌచ్ గురించి నోరు విప్పిన రాశీఖన్నా!
Updated : Apr 28, 2023
క్యాస్టింగ్ కౌచ్ అనేది సినిమా ఇండస్ట్రీలో నెవర్ ఎండింగ్ టాపిక్. ఎప్పుడూ ఎక్కడో ఒక చోట ఈ మాట గట్టిగా వినిపిస్తూనే ఉంటుంది. లేటెస్ట్ గా హీరోయిన్ రాశీఖన్నా కూడా ఈ టాపిక్ గురించి మాట్లాడారు. రాశీఖన్నా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి దశాబ్దం పూర్తయింది. సూజిత్ సిర్కార్ సినిమా మెడ్రాస్ కేఫ్ తో సినిమా రంగంలోకి ప్రవేశించారు రాశీ ఖన్నా. ఆ సినిమా తర్వాత సౌత్‌లో బిజీ అయిపోయారు. ఇప్పుడు నార్త్ లో వెబ్‌సీరీస్‌లతో బిజీ అయ్యారు. రాశీఖన్నా మాట్లాడుతూ `` ఇండస్ట్రీలో పదేళ్ల పాటు ప్రయాణించడమంటే మామూలు విషయం కాదు. నా అదృష్టం కొద్దీ ఈ జర్నీలో నాకు అందరూ మంచి వారే దొరికారు. నాతో జాన్ అబ్రహామ్ ఒక మాటన్నారు. `రాశీ ఏ విషయంలోనైనా సరే నువ్వు నో అని చెప్పాలనుకుంటే నో అని చెప్పేసెయ్.
చెప్పడమే కాదు, ఆ మాటకు కట్టుబడి ఉండు. అప్పుడే నిన్ను ఎవరైనా సరే సీరియస్‌గా తీసుకుంటారు. లేకుంటే గ్రాంటెడ్‌గా తీసుకుంటారు. అది మంచిది కాదు. నీ విలువ నిలబడాలంటే నచ్చనివాటికి నో చెప్పెయ్` అని అన్నారు. ఇవాళ్టికీ నేను ఆ విషయాన్ని పాటిస్తున్నా. సూజిత్ సిర్కార్ కూడా నాకు చాలా చాలా సలహాలు ఇచ్చారు. సౌత్‌లోనూ నాతో పనిచేసిన ప్రతి ఒక్కరూ మంచివారే. నా దగ్గర ఎవరూ తప్పుగా ప్రవర్తించలేదు. ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు చాలా అనుమానాలుంటాయి. చాలా మంది చాలా విషయాలను చెబుతుంటారు. ఒక రకమైన కన్‌ఫ్యూజన్ ఉంటుంది.
కానీ పరిశ్రమలో అడుగుపెట్టాక, అనుభవం వస్తున్నకొద్దీ మంచీ చెడులను మనం అర్థం చేసుకోవాలి. మన లిమిట్స్ లో ఉండాలి. ఎదుటివారితో ప్రొఫెషనల్‌గా బిహేవ్ చేయాలి. అదే చేసినప్పుడు మన పట్ల ఎవరూ తప్పుగా ప్రవర్తించరు. భగవంతుడి దయవల్ల నా కెరీర్‌లో నాకు చెడ్డవారుతగలలేదు. అలాగని ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదని నేను చెప్పను. నాకు అలాంటి చేదు అనుభవాలు లేవు`` అని అన్నారు రాశీఖన్నా. ప్రస్తుతం నార్త్ లో వెబ్‌సీరీస్‌లతో బిజీగా ఉన్నారు రాశీఖన్నా.