English | Telugu

'వ్యవస్థ' వెబ్ సిరీస్ రివ్యూ

వెబ్ సిరీస్ పేరు: వ్యవస్థ
తారాగణం: కార్తీక్ రత్నం, హెబ్బా పటేల్, సంపత్ రాజ్, కామ్నా జఠ్మలానీ, గురురాజ్, రామారావు జాదవ్, శ్రీతేజ ప్రసాద్, సుకృతా వాగ్లే తదితరులు
సంగీతం: నరేశ్ కుమారన్
ఎడిటింగ్: ఆది నారాయణ్
సినిమాటోగ్రఫీ: అనిల్ బండారి
నిర్మాత: పట్టాభి ఆర్. చిలుకూరి
దర్శకత్వం: ఆనంద్ రంగ
ఓటీటీ వేదిక: జీ5

సినిమా అయినా, సిరీస్ అయినా కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు అది ఏ ఓటీటీ వేదికలో ఉన్నా ఆదరిస్తున్నారు. ఈ మధ్య కాలంలో తెలుగు హీరోలు, దర్శకనిర్మాతలు సైతం ఓటీటీల కోసం ప్రత్యేకంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తున్నారు. అలాంటి వాటిల్లో ఈ మధ్య కాలంలో వచ్చిన 'రానా నాయుడు' ఒకటైతే, 'పులి-మేక' మరొకటి. ఇలా కొత్త కంటెంట్ తో సరికొత్తగా మనముందుకు వచ్చిన మరో వెబ్ సిరీస్ 'వ్యవస్థ'. జీ5లో ప్రసారమవుతున్న ఈ 'వ్యవస్థ' కథేంటో ఒకసారి చూసేద్దాం...

కథ:
యామిని(హెబ్బా పటేల్)కి అజయ్ అనే వ్యక్తితో పెళ్లి జరుగుతుంది. అయితే శోభనం రోజున వాళ్ళిద్దరి గది నుండి గన్ పేలిన శబ్దాలు వినిపించడంతో బయట ఉన్న పనివాళ్ళు తలుపు బద్దలుకొట్టుకొని లోపలికి వెళ్ళి చూసేసరికి అజయ్ నేలమీద రక్తపుమడుగులో పడి ఉంటాడు. యామిని చేతిలో గన్ ఉంటుంది. కాసేపటికి పోలీస్ వాళ్ళు వచ్చి తనని తీసుకెళ్తారు. తర్వాత రోజు కోర్ట్ లో హాజరుపరచగా.. యామని కేస్ ని వాదించడానికి ఫేమస్ క్రిమినల్ లాయర్ అవినాష్ చక్రవర్తి (సంపత్ రాజ్) ప్రిపేర్ అయ్యి ఉంటాడు. జడ్జ్ లు కేసు మొదలుపెట్టగానే.. యామిని తన లాయర్ ని మార్చుకోవాలని అనుకుంటున్నట్లుగా జడ్జ్ కి చెప్తుంది. దీంతో కోర్ట్ లో ఉన్న చక్రవర్తితో పాటుగా అందరూ ఆశ్చర్యపోతారు. అయితే లాయర్ అవినాష్ చక్రవర్తికి ఎదురుతిరిగి ఏ లాయర్ ముందుకు రాలేడు.. తన కేస్ ని వాదించలేడు.. అలాంటిది తను అవినాష్ చక్రవర్తిని వద్దని ఏ లాయర్ ని ఏర్పాటు చేసుకుంది? యామని ఆ కేస్ నుండి బయటపడిందా? ఇందులో వంశీ(కార్తీక్ రత్నం) పాత్ర ఏంటి? అసలు అజయ్ ని చంపింది ఎవరు? ఇవన్నీ తెలియాలంటే 'వ్యవస్థ' వెబ్ సిరీస్ చూడాల్సిందే.

విశ్లేషణ:
యామినికి కొత్తగా పెళ్ళయి శోభనం గదిలోకి వెళ్ళాక కాసేపటికి గన్ పేలిన శబ్దం.. ఆ తర్వాత అజయ్ శవం.. ఇలా ఈ కథ ఒక సస్పెన్స్ తో ఆసక్తికరంగా మొదలవుతుంది‌. కోర్ట్ లో చక్రవర్తి మ్యానరిజం.. విలనిజం చక్కగా చూపించారు. యామిని కేస్ ఇన్వెస్టిగేషన్ కోసం కొత్తగా నియమించిన పోలీస్ అధికారులు కూడా అవినాష్ చక్రవర్తి చేతిలో కీలుబొమ్మలుగా చూపించడం బాగుంది.

వ్యవస్థలో పెరిగిపోతున్న క్రైమ్స్ ని శాసించేది డబ్బు.. అంటూ అవినాష్ చక్రవర్తి ఆడే మైండ్ గేమ్ ఆకట్టుకుంది. అవినాష్ చక్రవర్తి చెక్ మేట్ అనే ఒక కొత్త వ్యవస్థనే ఏర్పాటు చేసి.. అందులోనే సగానికి పైగా కేస్ లను డబ్బులతో పరిష్కరించే విధానం.. సామ ధాన బేద దండోపాయలివే అంటూ అవినాష్ చక్రవర్తికి ఎలివేషన్ ఇచ్చే సీన్స్ అన్నీ కూడా ఆకట్టుకుంటాయి.

అసలు ఈ వ్యవస్థలో న్యాయం బ్రతికే ఉందని నిరూపించడానికి ప్రతీ సినిమాలో లాగే ఈ కథలోను వంశీ తాపత్రయపడతాడు. చక్రవర్తి దగ్గర జూనియర్ లాయర్ గా పనిచేసిన వంశీ.. అవినాష్ చక్రవర్తి లూప్ హోల్స్ అన్నీ తెలుసుకొని అక్కడికి వచ్చిన అమాయక ప్రజలకు సాయం చేస్తుండటం బాగుంటుంది.

క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సినిమాలలో కోర్ట్ సీన్స్,‌ అక్కడ డైలాగ్స్ చాలా కీలకం. ఈ కథలో కూడా అవే బాగుంటాయి. అయితే యామినిని కేస్ నుండి బయటకు పడేయానికి ఒక మూడు నాలుగు ఎపిసోడ్ లు సరిపోతాయి.. కానీ ఎనిమిది ఎపిసోడ్ లుగా ఈ కథని తెరకెక్కించడంతో ప్రేక్షకులకు కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ఒక్కో ఎపిసోడ్ నిడివి ఎక్కువ ఉండటంతో ప్రేక్షకులు చివరి దాకా చూసే ఓపిక ఉండదు. మూడు, నాలుగు ఎపిసోడ్ లు చక్రవర్తిని ఎలివేట్ చేయడానికే చేసినట్టుగా ఉంది‌. ఆ మూడు కలిపి ఒక ఎపిసోడ్ కి తీసుకొస్తే ప్రేక్షకులకు కాస్త ఊరటగా ఉండేది. ఈ వెబ్ సిరీస్ లో అన్ని ఎపిసోడ్ ల నిడివి ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రేక్షకుల సహనానికి పరీక్ష అనే చెప్పాలి. చాలా సాధారణ కథకి ఇంత లాగ్ అవసరం లేదు. కథ ఎంత బాగున్నా కథనం స్లోగా ఉండి, నిడివి ఎక్కువగా ఉంటే ప్రేక్షకులకు ఇబ్బందిగా ఉంటుందనే చెప్పాలి. నరేశ్ కుమారన్ సంగీతం బాగుంది. అనిల్ బండారి సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. మూడు, నాలుగు, ఐదు ఎపిసోడ్‌లలో కొన్ని సీన్స్ ని ఎడిటర్ ఆది నారాయణ్ ట్రిమ్ చేస్తే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:
యామినిగా హెబ్బా పటేల్ ముఖ్యపాత్ర పోషించింది. అవినాష్ చక్రవర్తి పాత్రలో సంపత్ రాజ్ ఒదిగిపోయాడు. ఈ సిరీస్ కి విలన్ కమ్ హీరో అనే చెప్పాలి. ఈ సిరీస్ కి ఆయువుపట్టుగా తన పాత్ర ఉంటుంది. చక్రవర్తి భార్యగా కామ్న జఠ్మలానీ ఉన్నంతలో పర్వాలేదనిపించింది. వంశీగా కార్తిక్ రత్నం ఆకట్టుకున్నాడు. మిగిలినవాళ్ళు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.

తెలుగువన్ పర్ స్పెక్టివ్:
క్రైమ్ సస్పెన్స్ కథలని ఇష్టపడే ప్రేక్షకులు ఒక్కసారి చూడగలుగుతారు అంతే. మళ్ళీ మళ్ళీ చూడాలన్నా విసుగు తెప్పించే ఈ 'వ్యవస్థ'.. కామన్ ఆడియన్స్ ఓపికకి పరీక్ష పెడుతుంది.

రేటింగ్: 2.5 /5

-దాసరి మల్లేశ్

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .