English | Telugu
అప్పులు తీర్చలేకపోతున్నా...అందరికీ సారీ...
Updated : May 1, 2023
టీవీ ఇండస్ట్రీలో రీసెంట్ గా ఒక విషాదం నెలకొంది. ఢీ షోలో ఫేమస్ కొరియోగ్రాఫర్‌గా రాణిస్తున్న డ్యాన్స్ మాస్టర్ చైతన్య సూసైడ్ చేసుకుని మరణించారు. నెల్లూరులోని క్లబ్ హోటల్ లో ఉండి తాను సూసైడ్ చేసుకుంటున్నట్లుగా ఒక వీడియోని రికార్డు కూడా చేసాడు. తన మరణానికి కారణం ఆర్థిక ఇబ్బందులే అని అందులో పేర్కొన్నారు. సూసైడ్ చేసుకుంటున్నందుకు తన తల్లిదండ్రులకు, తోటి డ్యాన్స్ మాస్టర్లకు, డ్యాన్సర్లకు పేరుపేరునా ఈ వీడియోలో సారీ చెప్పాడు చైతన్య. అప్పులు చేసాను కానీ వాటిని తీర్చలేకపోతున్నానంటూ బాధపడ్డాడు. ఒత్తిడి తట్టుకోలేక ఏం చేయాలో అర్థంకాకే ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆ సెల్ఫీ వీడియోలో చెప్పుకుని బాధపడ్డాడు. ఎంత ట్రై చేసినా అప్పులు తీర్చలేకపోతున్నానని ఇక తన వేరే మార్గం కనిపించడం లేదు అని ఆ వీడియోలో వెల్లడించాడు. చెల్లి ఫీల్ అవొద్దు...అస్సలు బాధపడొద్దు. అప్పులు చేసినప్పుడు తీర్చుకునే సత్తా కూడా ఉండాలి కానీ నాకు మాత్రం వాటిని తీర్చడానికి అవ్వట్లేదు..నా వల్ల కావట్లేదు..ఈ లైఫ్ ఇంక చాలు. అందరూ నన్ను బాగా చూసుకున్నారు. నాకు మీరంతా మంచి లైఫ్ ఇచ్చారు.
మీ అందరి నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతున్నా. ఇదే నా చివరి రోజు, చివరి క్షణం..ఏం జరగబోతోందో నాకే తెలీదు. ఢీ షోకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇంత నేమ్ అండ్ ఫెమ్ ఇచ్చినందుకు. ఒక తప్పు తర్వాత ఇంకో తప్పు చేస్తూనే అందరినీ ఇబ్బంది పెట్టేస్తున్నాను. ఢీ షో వల్ల పేరొస్తుంది కానీ రెమ్యూనరేషన్ రాదు. కానీ జబర్దస్త్ లో పేరు, రెమ్యూనరేషన్ చాల ఎక్కువ వస్తాయి అని చెప్పుకుని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు చైతన్య మాస్టర్. మొత్తం టీవీ ఇండస్ట్రీలోనే ఢీ షోకి ఉన్నంత ఫేమస్ మరే షోకి లేదు. అంత పాపులారిటీ సంపాదించుకుంది. 2009లో ప్రారంభమైన ఈ డ్యాన్స్ రియాలిటీ షో వరుసగా అన్ని సీజన్స్ తో డాన్స్ లవర్స్ ని అలరిస్తోంది. టాలెంటెడ్ డాన్సర్స్ కి, కొరియోగ్రాఫర్లకి సినీ అవకాశాలు కల్పించింది ఈ షో. ప్రస్తుతం ఢీ 15 ఛాంపియన్ షిప్ బాటిల్ పేరుతో ఎంటర్టైన్ మెంట్ అందిస్తున్నారు. ఈ షో రేటింగ్ కూడా అలాగే ఉంటుంది. అలాంటి షోలో ఇప్పుడు ఒక అనుకోని విషాదం చోటుచేసుకుంది.