English | Telugu

'ఉస్తాద్' స్పీడ్ మామూలుగా లేదు.. మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి

'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ మరో మాస్ ఎంటర్‌టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' కోసం చేతులు కలిపారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభమైంది. పది రోజుల పాటు జరిగిన మొదటి షెడ్యూల్ లో కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. మొదటి షెడ్యూల్ కి సంబంధించిన ఎడిటింగ్ పనులు కూడా ఇప్పటికే మొదలయ్యాయి. ఇక తాజాగా మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలవ్వడం విశేషం.

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్, దేవి శ్రీ ప్రసాద్ కలయికలో వచ్చిన 'గబ్బర్ సింగ్' ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. సంచలన వసూళ్లతో సరికొత్త రికార్డులు సృష్టించింది. 'గబ్బర్ సింగ్' విజయంలో సంగీతం కూడా కీలక పాత్ర పోషించింది. ఆ సినిమాలోని ప్రతి పాట బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. గబ్బర్ సింగ్ టైటిల్ సాంగ్ సహా కెవ్వు కేవ, మందు బాబులం వంటి పాటలు దశాబ్దం తరువాత కూడా మారుమ్రోగుతూ ప్రేక్షకులు కాలు కదిపేలా చేస్తున్నాయి. అలాంటి మ్యాజిక్ నే మరోసారి రిపీట్ చేయడానికి సిద్ధమయ్యారు ఈ త్రయం.

'ఉస్తాద్ భగత్ సింగ్' మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయని తెలుపుతూ తాజాగా మేకర్స్ ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. అందులో "అరేయ్ సాంబ రాస్కోరా" అంటూ గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ వినిపించింది. అలాగే వీడియోలో దేవి శ్రీ ప్రసాద్, హరీష్ శంకర్ ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు. వారి ఉత్సాహం చూస్తుంటే 'గబ్బర్ సింగ్'ని మించిన బ్లాక్ బస్టర్ ఆల్బమ్ అందించడానికి సిద్ధమవుతున్నట్లుగా ఉంది. మరి పవన్-హరీష్-దేవిశ్రీ త్రయం మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తారేమో చూద్దాం.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .