English | Telugu
ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘ఉప్పెన’కు నేషనల్ అవార్డ్
Updated : Aug 24, 2023
69వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో తెలుగు సినిమా తన సత్తా చాటుతూ పలు క్యాటగిరిలలో అవార్డులు గెలుపొందింది. ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా ‘ఉప్పెన’ అవార్డును సాధించింది. వైష్ణవ్‌తేజ్, కృతిశెట్టి, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వైష్ణవ్‌తేజ్, కృతిశెట్టి నటించిన తొలి సినిమాయే జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రం ఎంపిక కావడం విశేషం.