English | Telugu
జాతీయ పురస్కారాల్లో 'ఆర్ ఆర్ ఆర్' హవా.. ఏకంగా ఆరు విభాగాల్లో!
Updated : Aug 24, 2023
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ ఆర్ ఆర్'.. 69వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో సత్తా చాటింది. ఏకంగా ఆరు విభాగాల్లో ఈ సినిమా అవార్డ్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఉత్తమ సంపూర్ణ వినోదాత్మక చిత్రం, ఉత్తమ కొరియోగ్రాఫర్: ప్రేమ్ రక్షిత్ (నాటు నాటు), ఉత్తమ గాయకుడు: కాలభైరవ (కొమరం భీముడో), ఉత్తమ నేపథ్య సంగీతం (కీరవాణి), ఉత్తమ స్టంట్ కొరియోగ్రాఫర్ (కింగ్ సాలమన్), బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో ఆర్ ఆర్ ఆర్ ఎంపికైంది.
కాగా, 'ఆర్ ఆర్ ఆర్'లో ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా నటించగా.. 2022 మార్చి 25న జనం ముందు నిలిచింది.