English | Telugu
‘టైగర్’ ఆంధ్రా రేటు రూ.18 కోట్లు!
Updated : Aug 24, 2023
రవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల నిర్మిస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రానికి బిజినెస్‌పరంగా మంచి క్రేజ్ వస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్‌కు గుడ్ రెస్పాన్స్ రావడంతోపాటు బిజినెస్ కూడా స్పీడ్ అందుకుంది. ఈ సినిమా ఆంధ్రా ఏరియా రైట్స్‌ను ఉషా బాలకృష్ణ దక్కించుకున్నారు. నైజాంలో మాత్రం అభిషేక్ అగర్వాల్ సంతంగా ఏషియన్ ఫిలింస్ ద్వారా రిలీజ్ చెయ్యాలనుకుంటున్నారు. ఓవర్సీస్ రేటు మూడున్నర నుంచి నాలుగు కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారు. అది చాలా ఎక్కువగా భావిస్తున్న బయ్యర్లు మీమాంసలో పడ్డారు. ఇక సీడెడ్ బిజినెస్ కోసం స్పీడ్‌గానే క్లోజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇక రిలీజ్ విషయానికి వస్తే పెద్ద స్టార్ల సినిమాల మధ్య టైగర్ నాగేశ్వరరావు విడుదల కానుంది. నందమూరి బాలకృష్ణ ‘భగవత్ కేసరి’, తమిళ్ హీరో విజయ్ ‘లియో’ చిత్రాల మధ్యలో రవితేజ సినిమా రిలీజ్ అవుతోంది. అయినప్పటికీ సినిమా మీద ఉన్న నమ్మకంతోనే బయ్యర్లు కొనుగోలు చేస్తున్నారు.