English | Telugu
'భగవంత్ కేసరి' గాన కచేరి.. దబిడి దిబిడే ఇక!!
Updated : Aug 24, 2023
వరుస బ్లాక్ బస్టర్స్ తో మంచి ఊపు మీదున్నాడు నటసింహం నందమూరి బాలకృష్ణ. ఇప్పటికే 'అఖండ', 'వీరసింహారెడ్డి'తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన బాలయ్య.. ఇప్పుడు 'భగవంత్ కేసరి'గా పలకరించేందుకు సిద్ధమయ్యాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. దసరా కానుకగా అక్టోబర్ 19న జనం ముందుకు రానుంది.
ఇదిలా ఉంటే, 'భగవంత్ కేసరి'కి సంబంధించిన ఫస్ట్ సింగిల్ ని సెప్టెంబర్ 1న విడుదల చేయబోతున్నట్లు యూనిట్ ప్రకటించింది. గణేశ్ చతుర్థి సందర్భంగా వచ్చే "గణేశ్ ఆంథమ్" ఇది. ఈ పాటకు సంబంధించి యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్.. నందమూరి ఫ్యాన్స్ కి ఫెస్టివల్ ఫీలింగ్ తీసుకువచ్చిందనే చెప్పొచ్చు. 'భగవంత్ కేసరి' పాటల పల్లకిలో తొలి గీతంగా రాబోతున్న "గణేశ్ ఆంథమ్".. యూట్యూబ్ ముంగిట రికార్డుల పరంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి.
కాగా, 'భగవంత్ కేసరి'లో బాలయ్యకి జంటగా కాజల్ నటిస్తుండగా, శ్రీలీల ముఖ్య పాత్రలో కనిపించనుంది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ బాణీలు అందిస్తున్నాడు. షైన్ స్క్రీన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.