English | Telugu
వరుణ్, లావణ్య మ్యారేజ్ డేట్, లొకేషన్ ఫిక్స్!
Updated : Aug 24, 2023
వరుణ్‌తేజ్, పవ్రీణ్ సత్తారు కాంబినేషన్‌లో రూపొందిన ‘గాండీవధారి అర్జున’ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్ట్ 25న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ అవుతోంది. ఈమధ్యకాలంలో వరుణ్‌తేజ్ ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్‌లో చాలా బిజీగా ఉన్నాడు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత తన పెళ్ళికి సంబంధించిన పనుల్లో బిజీగా కాబోతున్నాడు. అంతకుముందు అతను చేసిన సినిమాలకు సంబంధించిన ప్రమోషన్స్‌లో లావణ్య త్రిపాఠితో తన వివాహం గురించి వార్తలను బయట పెట్టడంలో చాలా జాగ్రత్త పడ్డాడు. ఎంగేజ్‌మెంట్ జరిగిన తర్వాత వారు కలిసి వున్న ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు వరుణ్, లావణ్య. ఇటీవల వీరిద్దరూ కలిసి ఇటలీ వెళ్ళారు. నవంబర్‌లో వీరి వివాహం జరగనుంది. వివాహ వేదిక ఇటలీ కానుందని తెలుస్తోంది. ఈ వివాహానికి కుటుంబ సభ్యులతోపాటు సన్నిహితులు ఇటలీ వెళ్ళబోతున్నారు. వరుణ్‌తేజ్, లావణ్య కలిసి నటించిన సినిమాలు మిస్టర్, అంతరిక్షం. మిస్టర్ సెట్స్‌లో వీరిద్దరూ మొదటిసారి కలుసుకున్నారు. అంతరిక్షం షూటింగ్ టైమ్‌కి వీరు మరింత దగ్గరయ్యారు.