English | Telugu
జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. తగ్గేదేలే!
Updated : Aug 24, 2023
జాతీయ పురస్కారాలకు సంబంధించి ఇప్పటివరకు ఒక్క తెలుగు కథానాయకుడికి కూడా 'ఉత్తమ నటుడు' విభాగంలో పురస్కారం దక్కలేదు. అయితే, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆ విభాగంలో ఎంపికై.. సరికొత్త రికార్డు సృష్టించాడు. "తగ్గేదేలే" అంటూ 'పుష్ఫ: ది రైజ్' లో ప్రదర్శించిన అభినయానికి గానూ అల్లు అర్జున్ ఈ అవార్డు సొంతం చేసుకున్నారు. 'పుష్ప'కి సుకుమార్ దర్శకత్వం వహించారు. రెండు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కింది. కాగా, 1997లో 'అన్నమయ్య'కిగానూ కింగ్ నాగార్జున 'స్పెషల్ మెన్షన్' విభాగంలో మాత్రమే అవార్డు పొందారు.