English | Telugu
షూటింగ్ క్యాన్సిల్ చేసుకున్న మహేష్... ఎందుకో తెలుసా?
Updated : Aug 24, 2023
మనుషుల్ని ఎంతగా ప్రేమిస్తారో, ఎంతగా అభిమానిస్తారో జంతువుల్ని కూడా కొందరు అంతే ప్రేమిస్తారు, అభిమానిస్తారు. కొంతమంది అంతకు మించి అన్నట్టుగా కూడా తమ పెట్ యానిమల్స్ పట్ల ప్రేమను పెంచుకుంటారు. వాటికి చిన్న అనారోగ్యం కలిగినా తట్టుకోలేరు. ఆ పెట్ యానిమల్ చనిపోతే.. వారి మానసిక స్థితి ఎలా ఉంటుందో కదా! అలాంటి పరిస్థితే సూపర్‌స్టార్ మహేష్‌కి వచ్చింది. ‘గుంటూరు కారం’ షూటింగ్‌లో ఉండగా తను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న పెట్ డాగ్ ప్లూటో చనిపోయిందన్న విషయం తెలిసి చలించిపోయారు మహేష్. ఉన్నపళంగా షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని వెళ్లిపోయారు మహేష్. కళాకారుల మనస్తత్వాలు ఎంత సున్నితంగా ఉంటాయో, జంతువులతో సైతం వారి ఎమోషనల్ ఎటాచ్‌మెంట్స్ ఎంత డీప్‌గా ఉంటాయో ఈ ఘటన వల్ల మరోసారి తెలిసింది.