English | Telugu
అతనంటే సమంతకు అలాంటి అభిప్రాయం వుందా?
Updated : Aug 26, 2023
అర్జున్‌రెడ్డిలో విజయ్ దేవరకొండను చూసిన ఎవరికైనా నిజ జీవితంలో కూడా అతను అలాగే ఉంటాడా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ క్యారెక్టర్‌లో అతను అంతగా ఇన్‌వాల్వ్ అయిపోయాడు. ఎంతో నేచురల్‌గా వుండే అతని క్యారెక్టర్ చూస్తే అలా అనిపించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. సాధారణ ప్రేక్షకులే కాదు, హీరోయిన్ సమంత కూడా దానికి మినహాయింపు కాదు. వీరిద్దరూ కలిసి నటించిన ‘ఖుషి’ సెప్టెంబర్ 1న విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి చెన్నైలో జరిగిన ప్రమోషన్ కార్యకమ్రంలో విజయ్ దేవరకొండపై తనకు గతంలో వున్న అభిప్రాయాన్ని వెల్లడిరచింది. అర్జున్‌రెడ్డి సినిమాలో మందు, సిగరెట్ తాగడం, అమ్మాయిలతో తిరగడం వంటి సీన్స్‌లో ఎంతో నేచురల్‌గా కనిపించిన విజయ్.. నిజ జీవితంలో కూడా అలాగే ఉంటాడా అనే అభిప్రాయం తనకు కలిగిందని చెప్పింది. అయితే అతనితో కలిసి సినిమా చేయడం వల్ల అతను ఏమిటో, అతని అలవాట్లు ఏమిటో తెలిశాయని, నిజానికి ఆ సినిమాలో చూపించిన ఏ ఒక్క చెడ్డ అలవాటు అతనికి లేదు అని విజయ్ దేవరకొండకు సర్టిఫికెట్ ఇచ్చింది సమంత.