English | Telugu
'గాండీవధారి అర్జున' ఫస్ట్ డే కలెక్షన్స్.. మరీ ఇంత తక్కువేంటి వరుణ్!!
Updated : Aug 26, 2023
'గద్దలకొండ గణేశ్' తరువాత సాలిడ్ హిట్ లేని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. తాజాగా 'గాండీవధారి అర్జున'తో పలకరించాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్.. శుక్రవారం (ఆగస్టు 25) జనం ముందు నిలిచింది. మొదటి ఆట నుంచే ఈ సినిమాకి నెగటివ్ టాక్ వచ్చింది.
ఇక కలెక్షన్ల విషయానికి వస్తే.. వరుణ్ తేజ్ కెరీర్ లోనే లోయస్ట్ ఫిగర్ నమోదయ్యిందని ట్రేడ్ టాక్. రూ. 18 కోట్ల షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు కేవలం రూ. 1 కోటి షేర్ మాత్రమే ఆర్జించింది. శని, ఆది వారాల్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగితే మాత్రం.. మెగా కాంపౌండ్ లో హ్యాట్రిక్ డిజాస్టర్ పక్కా అంటున్నారు విశ్లేషకులు.
'గాండీవధారి అర్జున' ఫస్ట్ డే కలెక్షన్స్ వివరాలు:
నైజాం: రూ. 60 లక్షల గ్రాస్
సీడెడ్ : రూ. 15 లక్షల గ్రాస్
ఆంధ్రా: రూ. 65 లక్షల గ్రాస్
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలెక్షన్స్ : రూ. 1.40 కోట్ల గ్రాస్ (రూ.75 లక్షల షేర్)
కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్: రూ. 50 లక్షల గ్రాస్
ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే కలెక్షన్స్ : రూ. 1.90 కోట్ల గ్రాస్ (రూ.1 కోటి షేర్)