English | Telugu

అన్ని పార్టీల నాయకుల్ని గౌరవిస్తాను : రూమర్స్‌పై స్పందించిన రాహుల్‌

సింగర్‌, బిగ్‌బాస్‌ 3 విజేత రాహుల్‌ సిప్లిగంజ్‌ రాజకీయాల్లోకి రాబోతున్నాడన్న వార్త సోషల్‌ మీడియాలో బాగా స్ప్రెడ్‌ అయింది. దాంతో, అతను ఏ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాడనే ఊహాగానాలు కూడా ఎక్కువయ్యాయి. ఈ వార్తలపై రాహుల్‌ సిప్లిగంజ్‌ స్పందిస్తూ ‘‘నేను రాజకీయాల్లోకి వస్తున్నానని, గోషామహల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నానని కొన్ని రోజులుగా వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. నేను కళాకారుణ్ని. అన్ని పార్టీలకు చెందిన రాజకీయ నాయకుల్ని గౌరవిస్తాను. ప్రేక్షకులకు వినోదాన్ని అందించడమే నా పని. జీవితాంతం ఆర్టిస్ట్‌గానే కొనసాగుతాను. సంగీతంలోనేనా కెరీర్‌ కొనసాగిస్తాను. ఇండస్ట్రీలో నేను చేయాల్సి పని చాలా ఉంది. ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుల్ని నేను కలవలేదు. అలాగే నన్ను ఎవరూ కలవలేదు. ఇలాంటి రూమర్స్‌ ఆపండి’’ అంటూ విజ్ఞప్తి చేశారు రాహుల్‌ సిప్లిగంజ్‌.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.