English | Telugu

షారుఖ్‌ని ఫాలో అవుతున్న ద‌ళ‌ప‌తి

ద‌ళ‌ప‌తి విజ‌య్ ఇప్పుడు షారుఖ్ ఖాన్‌ని ఫాలో అవుతున్నారు. ప్ర‌స్తుతం జ‌వాన్ సినిమాలో న‌టిస్తున్నారు షారుఖ్ ఖాన్‌. ఆయ‌న హీరోగా న‌టిస్తున్న సినిమాకు అట్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. న‌య‌న‌తార‌, విజ‌య్ సేతుప‌తి, ప్రియామ‌ణి, దీపిక ప‌దుకోన్ కీ రోల్స్ చేస్తున్నారు. సెప్టెంబ‌ర్ 7న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది జ‌వాన్‌. ఈ సినిమా నుంచి మ‌ల్టీఫేసెటెడ్ పిక్ రిలీజ్ చేశారు రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్. ఈ చిత్రంలో విజ‌య్ కీ రోల్ చేస్తున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇందులో నిజం ఉన్నా, లేక‌పోయినా, ఒక్క విష‌యంలో మాత్రం సీరియ‌స్‌గా షారుఖ్ ని ఫాలో అవుతున్నారు ద‌ళ‌ప‌తి విజ‌య్‌. అయితే షారుఖ్‌లాగానే క‌మ‌ల్‌హాస‌న్ కూడా ప్ర‌య‌త్నించార‌ని,వాళ్లిద్ద‌రినీ విజ‌య్ ఫాలో అవుతున్నార‌ని కొంద‌రి చ‌ర్చ‌.

ప్ర‌స్తుతం లియో మూవీలో న‌టిస్తున్న విజ‌య్ నెక్స్ట్ వెంక‌ట్ ప్ర‌భు డైర‌క్ష‌న్‌లో ఓ సినిమాలో న‌టిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయ‌న ప్ర‌స్తుతం ఫారిన్‌కి వెళ్లారు. అక్క‌డ త్రీడీ వీయ‌ఫ్ ఎక్స్ స్కానింగ్ చేయించుకున్నారు. లాస్ ఏంజెల్స్ లో ఈ స్కానింగ్ ఆల్రెడీ చేయించుకున్నారు షారుఖ్ ఖాన్‌. ఆయ‌న న‌టించిన ఫ్యాన్ సినిమా కోసం ఈ స్కానింగ్ జ‌రిగింది. రీసెంట్ గా ఇండియ‌న్ 2 కోసం క‌మ‌ల్‌హాస‌న్ కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అయ్యారు. వారిద్ద‌రి స‌ల‌హా మేర‌కే విజ‌య్ ఇప్పుడు ఈ స్కానింగ్ చేయించుకున్నార‌ట‌. వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ న‌టిస్తున్న సినిమా అక్టోబ‌ర్ త‌ర్వాత మొద‌ల‌వుతుంది. ఈ సినిమాలో విజ‌య్ డ్యూయ‌ల్ రోల్‌లో క‌నిపిస్తార‌ట‌. జ్యోతిక‌, ప్రియాంక మోహ‌న్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే హీరోయిన్ల గురించి హింట్ ఇచ్చేశారు డైర‌క్ట‌ర్‌. జ్యోతిక‌, విజ‌య్ జోడీ త‌మిళ ప్రేక్ష‌కుల‌కు కొత్త కాదు. కానీ విజ‌య్ స‌ర‌స‌న ప్రియాంక మోహ‌న్ అనే టాక్ మాత్రం కాస్త కిక్ ఇస్తోంది ఫ్యాన్స్ కి.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.