English | Telugu

'బెదురులంక 2012' ఫస్ట్ డే కలెక్షన్స్.. ఇదే ఊపు కొనసాగితే హిట్ పక్కా!!

బ్లాక్ బస్టర్ మూవీ 'ఆర్ ఎక్స్ 100' తరువాత సాలిడ్ హిట్ లేని కార్తికేయ.. తాజాగా 'బెదురులంక 2012' చిత్రంతో పలకరించాడు. 'డీజే టిల్లు' బ్యూటీ నేహాశెట్టి కథానాయికగా నటించిన ఈ సినిమాకి క్లాక్స్ దర్శకత్వం వహించగా.. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతమందించాడు. శుక్రవారం (ఆగస్టు 25) జనం ముందు నిలిచిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది.

ఇక, ఫస్ట్ డే కలెక్షన్స్ విషయానికి వస్తే.. 'బెదురులంక 2012' ప్రపంచవ్యాప్తంగా డీసెంట్ వసూళ్ళు రాబట్టింది. రూ. 4. 50 కోట్ల షేర్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన 'బెదురులంక'.. తొలి రోజు వరల్డ్ వైడ్ రూ. 1.63 కోట్ల గ్రాస్ ని, రూ. 94 లక్షల షేర్ ని ఆర్జించింది. శని, ఆది వారాల్లో కూడా ఈ సినిమా ఇదే ఊపుని కొనసాగిస్తే.. బ్రేక్ ఈవెన్ అవడం ఖాయమనే చెప్పొచ్చు.

'బెదురులంక 2012' ఫస్ట్ డే కలెక్షన్స్ వివరాలు:
నైజాం: రూ. 42 లక్షల గ్రాస్
సీడెడ్ : రూ. 23 లక్షల గ్రాస్
ఉత్తరాంధ్ర: రూ. 20 లక్షల గ్రాస్
ఈస్ట్ గోదావరి :రూ. 12 లక్షల గ్రాస్
వెస్ట్ గోదావరి : రూ. 7 లక్షల గ్రాస్
గుంటూరు: రూ. 14 లక్షల గ్రాస్
కృష్ణ : రూ. 12 లక్షల గ్రాస్
నెల్లూరు: రూ. 6 లక్షల గ్రాస్

తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలెక్షన్స్ : రూ. 1.36 కోట్ల గ్రాస్ (రూ.80 లక్షల షేర్)
కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్: రూ. 27 లక్షల గ్రాస్
ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే కలెక్షన్స్ : రూ. 1.63 కోట్ల గ్రాస్ (రూ.94 లక్షల షేర్)

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.